Telugu Global
Cinema & Entertainment

Tarun Bhaskar | తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా జంటగా సినిమా

Tarun Bhaskar - దర్శకుడి నుంచి నటుడిగా మారి చాన్నాళ్లయింది. ఇప్పుడు లీడ్ రోల్ కు కూడా షిఫ్ట్ అయ్యాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.

Tarun Bhaskar | తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా జంటగా సినిమా
X

ఇప్పటికే పలు చిత్రాల్లో తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తుంది. సంజీవ్ ఎఆర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ పై సృజన్ యరబోలు నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను మేకర్స్ ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేశారు.

రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటోంది. ఈరోజు (ఏప్రిల్ 19) హీరోయిన్ ఈషా రెబ్బా పుట్టినరోజును సెట్స్‌ లో చిత్ర బృందం సెలబ్రేట్ చేసింది. యూనిట్ విడుదల చేసిన స్టిల్‌లో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రూరల్ గెటప్‌లలో ఆకట్టుకున్నారు. తరుణ్ ఫార్మల్ డ్రెస్‌లో డీసెంట్‌గా కనిపిస్తుండగా, ఈషా సంప్రదాయ చీరలో మెరిసింది.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అక్టోబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. బ్రహ్మాజీ, శివన్నారాయణ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు జై సంగీతం అందిస్తున్నాడు.

First Published:  19 April 2024 5:13 PM GMT
Next Story