Telugu Global
Cinema & Entertainment

సీతారామం ట్రయిలర్ రివ్యూ

దుల్కర్ హీరోగా నటించిన సీతారామం ట్రయిలర్ రిలీజైంది. రష్మిక కీలక పాత్ర పోషించింది. మరి ట్రయిలర్ ఎలా ఉంది?

Sita Ramam Movie Trailer Review
X

దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సీతారామం. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనేది క్యాప్షన్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా, రష్మిక కీలక పాత్ర పోషించింది. బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ మరో కీలక పాత్ర పోహిస్తున్నారు. గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో 'సీతారామం' థియేట్రికల్ ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

థియేట్రికల్ ట్రైలర్ 'సీతారామం' ఎపిక్ లవ్ స్టొరీలోని కీలకమైన ఘట్టాలని ఆసక్తికరంగా ఆవిష్కరించింది."20 ఏళ్ల క్రితం లెఫ్ట్‌నెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామ‌హాల‌క్ష్మికి నువ్వే చేర్చాలి' అనే డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

రామ్ ఒక అనాథ. కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గా భాద్యతలు నిర్వహిస్తుంటాడు. సీత అనే అమ్మాయి నుండి వచ్చిన ఉత్తరం రామ్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రామ్, సీతను కలుస్తాడు. వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. రామ్ కాశ్మీర్‌ లోని తన క్యాంపు కి తిరిగి వచ్చినప్పుడు సీతకు ఒక లేఖ రాస్తాడు. కానీ అది ఆమెకు చేరలేదు. 20 ఏళ్ల తర్వాత సీతకు ఆ లేఖ ఇచ్చే భాద్యత రష్మికపై పడుతుంది. తరుణ్ భాస్కర్‌ తో కలిసి సీతను అన్వేషించే పనిలో పడుతుంది రష్మిక. సీత అన్వేషణ లో విఫలమైన వారు.. రామ్‌ కోసం అన్వేషణ మొదలుపెడతారు. కానీ రామ్ ని పట్టుకోవడం సీతని అన్వేషించడం కంటే కష్టమౌతుంది. దీనికి కారణం రామ్ బాస్ బ్రిగేడియర్ విష్ణు శర్మ (సుమంత్). ట్రైలర్ లో ఆవిష్కరించిన ఈ సన్నివేశాలు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి.

1965, 80 నేప‌థ్యంలో సాగే ఈ ప్రేమ‌క‌థ ఆనాటి వాతావ‌ర‌ణాన్ని ప్రతిబింబించేలా అద్భుతంగా సాగింది. అత్యున్నత నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేసిన సినిమా కావడంతో క్వాలిటీ స్పష్టంగా కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. రష్మిక మందన్న హీరోయిక్ రోల్, సుమంత్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించడం ఆసక్తికరంగా ఉంది.

పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ విజువల్ వండర్ గా ఉంది. ట్రైలర్ కి విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన రీ-రికార్డింగ్ గ్రాండ్ గా ఉంది. రెండు విభిన్న కాలాల కథను సులభంగా అర్థమయ్యే రీతిలో అందించడంలో మాస్టర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు తన మార్క్ ని చూపించారు. ఆగస్ట్ 5న సీతారామం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.



First Published:  25 July 2022 1:10 PM GMT
Next Story