Telugu Global
Cinema & Entertainment

Manamey | శర్వానంద్ మూవీ టీజర్ ఎలా ఉందంటే..?

Manamey Movie Teaser - శర్వానంద్ తాజా చిత్రం మనమే. ఈ సినిమా టీదర్ ఎలా ఉందో చూద్దాం...

Manamey | శర్వానంద్ మూవీ టీజర్ ఎలా ఉందంటే..?
X

శర్వానంద్ 35వ చిత్రం 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, ఇలా..ప్రతి ప్రమోషనల్ మెటిరియల్ కి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు, మేకర్స్ ఈ చిత్రం టీజర్‌తో ముందుకు వచ్చారు. టీజర్ లో ప్రధానమైన పాత్రల్ని పరిచయం చేశారు.

ఇది పరస్పరం భిన్నమైన మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు, వారి జర్నీలో ఊహించని అతిథి కథ. శర్వానంద్ హీరో పాత్రలో అమాయకంగా కనిపిస్తున్నారు కానీ కనిపిస్తున్నంత అమాయకుడు కాదు. అతను జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇష్టపడే ప్లేబాయ్. కృతి శెట్టి బాధ్యతాయుత అమ్మాయిగా కనిపించింది. పిల్లాడి పాత్రలో విక్రమ్ ఆదిత్య ఎంట్రీతో వారి జీవితాలు తలకిందులౌతాయి.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య న్యూ ఏజ్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 3 పాత్రల మధ్య రిలేషన్ ని బయటపెట్టకుండా టీజర్‌ను స్మార్ట్ గా కట్ చేశాడు. త్వరలో విడుదల కానున్న థియేట్రికల్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశాడు.

శర్వానంద్ కూల్‌గా కనిపించాడు. తన పాత్రలో ఆదరగొట్టారు. కృతి శెట్టి అందంగా ఉంది. తన పాత్రలో ఒదిగిపోయింది. బాబు విక్రమ్ ఆదిత్య అందరినీ ఆకట్టుకున్నాడు. విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ కెమెరా పనితనం ప్రత్యేకంగా నిలవగా.. హేషమ్ అబ్దుల్ వహాబ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. ఈ సమ్మర్ లోనే థియేటర్లలోకి వస్తోంది మనమే సినిమా.

First Published:  19 April 2024 5:18 PM GMT
Next Story