Telugu Global
Cinema & Entertainment

Maname | శర్వానంద్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్

Sharwanand's Maname - శర్వానంద్ కొత్త సినిమా మనమే. ఈ సినిమా నుంచి పాటల విడుదల కార్యక్రమం మొదలైంది.

Maname | శర్వానంద్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్
X

శర్వానంద్ 35వ చిత్రం 'మనమే'. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంది. టైటిల్ గ్లింప్స్ కూడా కూల్ గా ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

ఫస్ట్ సింగిల్- 'ఇక నా మాటను' విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ప్రమోషన్‌ ప్రారంభించారు మేకర్స్. కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ రీసెంట్ ఆల్బమ్‌లు ఖుషి, హాయ్ నాన్న బ్లాక్‌బస్టర్‌లుగా కావడంతో ఈ సాంగ్ పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను అందుకుంది ఈ సాంగ్.

కాలేజ్ కి వెళ్లే యువతను, ప్రత్యేకంగా సింగిల్స్‌ ను ఈ సాంగ్ అలరించబోతుంది. కృష్ణ చైతన్య సాహిత్యం సింగిల్ గా ఉండటలో గొప్పదనాన్ని తెలియజేస్తుంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ వినగానే ఆకట్టుకునే పాటని అందించాడు, అతని వాయిస్ మరింత ఫన్ ని యాడ్ చేసింది.

పాటలో శర్వానంద్ హుక్ స్టెప్ బాగుంది. శ్రాస్తి వర్మ కొరియోగ్రఫీ చేశారు. శర్వా డ్రెస్సింగ్, స్టైలింగ్ ట్రెండీగా ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు.

First Published:  29 March 2024 2:34 AM GMT
Next Story