Telugu Global
Cinema & Entertainment

Game Changer | గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది

Game Changer - రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.

Game Changer | గేమ్ చేంజర్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది
X

జ‌ర‌గండి జ‌ర‌గండి.. జాబిల‌మ్మ జాకెట్టెసుకొచ్చెనండి.. అంటూ మ‌న‌సుకు న‌చ్చిన హీరోయిన్ కియారా అద్వానీని చూసి హీరో రామ్ చ‌ర‌ణ్‌ పాట పాడితే వినటానికి ఉత్సాహంగా ఉంటుంది. మ‌రి దాన్ని సిల్వ‌ర్ స్క్రీన్‌పై శంక‌ర్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తే చూడ‌టానికి రెండు క‌ళ్లు చాల‌వ‌నేంత గొప్ప‌గా ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు. రామ్ చ‌ర‌ణ్‌, కియారా ఆటా పాట‌, త‌మ‌న్ సంగీతం, శంక‌ర్ మేకింగ్ స్టైల్... ఇలా వావ్ అనేలా తెర‌కెక్కిన ఈ పాట‌ను చూడాలంటే ‘గేమ్ ఛేంజర్’ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందేనంటున్నారు నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్‌.

రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ‘జ‌ర‌గండి’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 150కి పైగా థియేటర్స్‌లో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించటం విశేషం. త‌మ‌న్ సంగీత సారథ్యంలోని ఈ పాట‌ను అనంత శ్రీరామ్ రాయ‌గా ద‌లేర్ మెహందీ, సునిధీ చౌహాన్ పాడారు.

‘జరగండి’ పాట విషయానికి వస్తే.. రామ్ చరణ్, కియార అద్వానీ జంట స్క్రీన్‌పై చూడముచ్చ‌ట‌గా ఉంది. ఇక డైరెక్ట‌ర్ శంక‌ర్ మేకింగ్‌లో త‌న‌దైన భారీతనాన్ని చూపించ‌బోతున్నార‌ని పాట‌లోని కొన్ని స‌న్నివేశాల‌ను చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించాడు.

RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ హీరోగా వ‌స్తోన్న సినిమా కావ‌టంతో గేమ్ ఛేంజ‌ర్ కోసం మెగాభిమానులు, సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

First Published:  28 March 2024 2:49 AM GMT
Next Story