Telugu Global
Cinema & Entertainment

Rajasekhar | ఎట్టకేలకు ఫుల్ లెంగ్త్ పాత్ర

Rajasekhar - సీనియర్ హీరో రాజశేఖర్ ఆల్రెడీ క్యారెక్టర్ నటుడిగా మారారు. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ రోల్ లో కనిపించబోతున్నారు.

Rajasekhar
X

చాలా పాపులర్ సీనియర్ నటుడు రాజశేఖర్. అయితే హీరోగా ఆయన సినిమాలు చేయడం తగ్గించేశారు. క్యారెక్టర్ రోల్స్, ప్రత్యేక పాత్రలు పోషించడం ప్రారంభించారు. గత సంవత్సరం నితిన్ నటించిన “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” చిత్రంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు.

అయితే అది పూర్తిస్థాయి పాత్ర కాదు. సినిమా కూడా క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు మరో సినిమాతో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారబోతున్నారు రాజశేఖర్. ప్రస్తుతం శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నాడు. బైక్ రేసింగ్‌కు సంబంధించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

"లూజర్" అనే వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించిన అభిలాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు రాజశేఖర్. సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అది. తాజాగా సెట్స్ లో కూడా జాయిన్ అయ్యారు రాజశేఖర్.

ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండడంతో రాజశేఖర్ వెంటనే అంగీకరించారు. యాంగ్రీ యంగ్ మేన్ పాత్రలతో పేరు తెచ్చుకున్నారు రాజశేఖర్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి.

First Published:  25 April 2024 3:29 AM GMT
Next Story