Telugu Global
Cinema & Entertainment

Pushpa 2 | మే డే రోజున మొదటి సాంగ్

Pushpa 2 - పుష్ప-2 ఫస్ట్ సాంగ్ రెడీ అయింది. ఈరోజు ప్రోమో రిలీజ్ చేశారు. మే 1న ఫుల్ సాంగ్ విడుదల చేస్తారు.

Pushpa 2 | మే డే రోజున మొదటి సాంగ్
X

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప‌-2 ది రూల్. పుష్ప ది రైజ్‌తో ప్ర‌పంచ సినీ ప్రేమికుల‌ను అమితంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు అంద‌రూ ఫిదా అయిపోయిన సంగ‌తి తెలిసిందే.

దీంతో పుష్ప‌-2 ది రూల్ గురించి ఎటువంటి అప్‌డేట్ వచ్చినా సెన్సేషన్ అవుతోంది. . ఇటీవల ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఆ టీజర్‌కు వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీజర్‌ విడుదలైనప్పటి నుండి నాన్‌స్టాప్‌గా 138 గంటల పాటు యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్‌ లో నిలిచి కొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా పుష్ప -2 ది రూల్‌ కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. దేవి శ్రీప్రసాద్‌ సంగీత సారథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం పాటల్లోంచి మొదటి లిరికల్‌ వీడియో సాంగ్‌ను మే 1న ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. దీనికి సంబంధించిన 20 సెకండ్ల ప్రోమోను విడుదల చేశారు.

2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతో పాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చిపెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2 ద రూల్ పై భారీ అంచనాలు పెరిగాయి. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పుష్ప-2 రిలీజ్ కానుంది.

First Published:  24 April 2024 5:26 PM GMT
Next Story