Telugu Global
Cinema & Entertainment

NTR | తెరపైకి మరో నందమూరి తారకరామారావు

NTR - ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు త్వరలోనే సినిమాల్లోకి రాబోతున్నాడు. అతడి పేరు కూడా నందమూరి తారక రామారావే.

NTR | తెరపైకి మరో నందమూరి తారకరామారావు
X

నందమూరి తారకరామారావు గురించి ప్రపంచం మొత్తం తెలుసు. స్వర్గీయ ఎన్టీఆర్ అడుగుజాడల్లో ఆయన మనవుడు మరో నందమూరి తారక రామారావు ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్ గురించి కూడా మనందరికీ తెలుసు. ఇప్పుడు తెలుగుతెరపైకి మరో తారక రామారావు రాబోతున్నాడు.

హరికృష్ణ కొడుకు జానకి రామ్ పదేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. జానకి రామ్ పెద్ద కొడుకు పేరు నందమూరి తారక రామారావు. అతడిప్పుడు సినిమాల్లోకి రాబోతున్నాడు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

జానకిరామ్ మరణం తర్వాత అతడి కుటుంబ పూర్తి బాధ్యతల్ని కల్యాణ్ రామ్-జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నారు. మరి జానకిరామ్ కొడుకు తారక రామారావు సినిమాల్లోకి రావాలనే నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ కుటుంబానికి వీరాభిమానిగా ఉన్న దర్శకుడు వైవీఎస్ చౌదరి, జానకిరామ్ కొడుకు తారకరామారావును ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడట. గతంలో హరికృష్ణతో లాహిరిలాహిరిలాహిరి సినిమాను తెరకెక్కించింది ఇతడే. రామ్ ను హీరోగా పరిచయం చేసింది కూడా ఇతడే. ఇతడి దర్శకత్వంలో తారకరామారావు వెండితెరకు పరిచయమౌతాడానే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తారట.

First Published:  26 March 2024 3:58 AM GMT
Next Story