Telugu Global
Cinema & Entertainment

ప్రేమ వివాహమే చేసుకుంటా- విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని స్పష్టం చేశారు.

ప్రేమ వివాహమే చేసుకుంటా- విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
X

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుండగా.. ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.

ఈ సందర్భంగా తమిళనాడులో నిర్వహించిన మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ మీడియాతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాల గురించి, తన పెళ్లి గురించి మాట్లాడారు. తనకు కూడా పెళ్లి చేసుకోవాలని..తండ్రి కావాలని ఉందని చెప్పారు. కాకపోతే ఇప్పుడే పెళ్లి చేసుకోనన్నారు. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయి తప్పక నచ్చాలని అన్నారు.

విజయ్ దేవరకొండ, ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు ఈవెంట్లు, పార్టీలకు వీరిద్దరూ జంటగా హాజరయ్యారు. అయితే తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని.. తమ మధ్య ఏ బంధం లేదని విజయ్, రష్మిక పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

First Published:  29 March 2024 1:44 PM GMT
Next Story