Telugu Global
Cinema & Entertainment

Family Star | ఫ్యామిలీ స్టార్ నుంచి మరో సాంగ్ రిలీజ్

Family Star - ఫ్యామిలీ స్టార్ నుంచి మూడో సాంగ్ రిలీజ్ చేశారు. హోలీ సంబరాల మధ్య గ్రాండ్ గా రిలీజైంది ఈ పాట.

Family Star | ఫ్యామిలీ స్టార్ నుంచి మరో సాంగ్ రిలీజ్
X

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా నుంచి థర్డ్ సింగిల్ 'మధురము కదా..' లిరికల్ సాంగ్ ను హైదరాబాద్ లోని మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీలో హోలీ వేడుకల మధ్య గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. "ఫ్యామిలీ స్టార్" సినిమా టీమ్ కు మై హోమ్ జెవెల్ ఫ్యామిలీస్ సాదరంగా స్వాగతం పలికారు. మూవీ టీమ్ తో హోలీ ఆడుతూ, కలిసి డ్యాన్సులు చేస్తూ, ఫొటోస్ తీసుకుంటూ సందడి చేశారు.

ఈ సాంగ్ లాంఛ్ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - "తన కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టారే. ఈ కథ మొదట విజయ్ విన్నాడు. నాకు ఫోన్ చేసి పరశురామ్ మంచి స్టోరీ చెప్పాడు మీరు వింటారా అని అడిగాడు. నేను కథ విన్నాక 15 నిమిషాల్లో ఓకే చెప్పేశాను. ఎందుకంటే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కథ. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎమోషన్స్ అన్నీ విజయ్ క్యారెక్టర్ లో చూస్తారు." అన్నారు.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - "నేను చదువుకునే రోజుల్లో హోలీ పండుగ అంటే భయపడేవాడిని. రంగులు పూస్తారు, అవి అలాగే ఉండిపోతాయని ఇంట్లోనే ఉండిపోయేవాడిని. అదే టైమ్ లో ఎగ్జామ్స్ జరుగుతుంటే చాలా మంది మొహం నిండా రంగులతో వచ్చేవారు. కానీ ఇక్కడ మీ అందరితో కలిసి హోలీ జరుపుకుంటుంటే పండుగంటే ఇలా ఉండాలని అనిపిస్తోంది. మీ అందరి ఎగ్జామ్స్ కంప్లీట్ అయినట్లు ఉన్నాయి. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ సినిమా చూసేందుకు థియేటర్స్ కు రండి. మన లాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఒక పర్సన్ కథ ఇది. ఫ్యామిలీ గురించి ఆలోచించే వారి కథ." అన్నాడు.

'మధురము కదా..' పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా..శ్రేయా ఘోషల్ పాడారు. గోపి సుందర్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశాడు. "ఫ్యామిలీ స్టార్" సినిమా ట్రైలర్ ను ఈ నెల 28న రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  26 March 2024 3:50 AM GMT
Next Story