Telugu Global
Andhra Pradesh

వైసీపీ మేనిఫెస్టో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. కీలక అంశాలివే..!

అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే.. ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షక పథకాలను జగన్‌ ప్రకటిస్తారని తెలుస్తోంది.

వైసీపీ మేనిఫెస్టో రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. కీలక అంశాలివే..!
X

ఏపీలో అధికార వైసీపీ పార్టీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారైననట్లు తెలుస్తోంది. రేపు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న జగన్‌.. ఎల్లుండి అంటే ఈ నెల 26న తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే.. ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షక పథకాలను జగన్‌ ప్రకటిస్తారని తెలుస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తామనే దానిపై మేనిఫెస్టో క్లారిటీ ఇవ్వనున్నారు. మహిళలు, రైతులు, యువత టార్గెట్‌గా మేనిఫెస్టో ఉంటుందని సమాచారం.

వైసీపీ మేనిఫెస్టోపై ఇప్పటికే ఉత్కంఠ నెలకొంది. వైసీపీ మేనిఫెస్టో కోసం జనమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో తెచ్చిన మేనిఫెస్టో జగన్‌కు బంపర్ మెజార్టీని కట్టబెట్టింది. ఈసారి అంతకుమించి మేనిఫెస్టో ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

First Published:  24 April 2024 5:56 AM GMT
Next Story