Telugu Global
Andhra Pradesh

అభివృద్ధికి కొత్త అడ్రస్ - జగన్.. ప్ర‌చారానికి పాత అడ్ర‌స్ చంద్ర‌బాబు

రైతుకి ఉపయోగపడే పనులు ఏ ఒక్కటీ చెయ్యకుండా, జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేసిన పనులను వృథా వ్యయంగా చిత్రీకరిస్తూ - రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా కాలికి బలపంకట్టుకుని ఊరూరా ప్రచారం చేశారు. కానీ, ఫలితాలు చూసి, ఆ విషయం మళ్ళీ మాట్లాడటం మానేశారు.

అభివృద్ధికి కొత్త అడ్రస్ - జగన్..   ప్ర‌చారానికి పాత అడ్ర‌స్ చంద్ర‌బాబు
X

అభివృద్ధికి అన్న లాంటి వాడినని డప్పు కొట్టుకునే చంద్రబాబు నిజానికి ఏం చేశారు ఆంధ్రప్రదేశ్‌కి? విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసే గౌరవం దక్కినా కాకమ్మ కబుర్లతో కాలయాపన చేశారు తప్ప, ఆయన తన హయాంలో ఒరగబెట్టింది గుండు సున్నా.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చర్యలు మొదలుపెట్టారు. సంక్షేమాన్నీ, అభివృద్ధినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తన కార్యక్రమాలు రూపొందించుకుని అమలు చెయ్యటం మొదలు పెట్టారు.

ఒక ప్రభుత్వ పనితీరుకు కొలమానం తులనాత్మక అధ్యయనం మాత్రమే. అది కూడా గణాంకాలని నమ్మాల్సిందే. ఈ అంకెలు కూడా నాటి చంద్రబాబు ప్రభుత్వ పనితీరుని నేటి జగన్ ప్రభుత్వ పనితీరుతో సరిపోల్చుకుంటే అసలు విషయం తెలుస్తుంది. గణాంకాలు ఎవరివి వాళ్ళు తయారుచేసుకోరు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకి గణాంకాలు పంపితే వారు వాటిని పరిశీలించి లెక్కగట్టి పనితీరు సూచీలను ప్రకటిస్తారు.

ఈ లెక్కన, కొన్ని అంశాలను మనం పరిశీలిద్దాం.

GSDP (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి)ని తీసుకుంటే బాబు పరిపాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ 2018-19 కాలంలో 11 శాతం వృద్ధి సాధించి దేశంలో 16 వ స్థానంలో నిలిచింది.

జగన్ పరిపాలనా కాలంలో 2022-23 కాలానికి 16.2 శాతం వృద్ధి సాధించి దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇది కదా అభివృద్ధి అంటే.

రంగాల వారీగా.. 2018-2019 వృద్ధి రేటుని, 2022-23 వృద్ధి రేటుని చూస్తే జగన్ కాలంలో రాష్ట్రం చాలా జోరుగా అభివృద్ధి సాధించింది. వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, సేవల రంగం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇలా ఏ రంగం తీసుకున్నా, జగన్ సుపరిపాలన అందిచగలిగారనేది కేంద్ర ప్రభుత్వ సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పారిశ్రామికాభివృద్ధిలో 17 నుంచి 4వ ర్యాంక్‌కు, సేవల రంగంలో 11వ స్థానం నుంచి మూడో ర్యాంక్‌, ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎనిమిదో స్థానం నుంచి ఏకంగా దేశంలో మొదటి స్థానానికి ఆంధ్రప్రదేశ్ ఎగబాకింది గడిచిన నాలుగేళ్ల జగన్ పాలనా కాలంలోనే.

తలసరి ఆదాయం కూడా 2017-18 కాలంలో చంద్రబాబు హయాంలో రూ. 1,38,299 ఉంటే, జగన్ నేతృత్వంలో అది 2022-2023 కాలానికి రూ. 2,19,518కి పెరిగింది.

వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వ‌డం ద్వారా రైతుల ఆదాయం పెరగడానికి జగన్ ప్రభుత్వం దోహదం చేసింది. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకి రాజశేఖర రెడ్డి కాలంలోనే గట్టి సమాధానం ఇచ్చారు.

చంద్రబాబు రూ. 61,758 కోట్ల సాయాన్ని రైతులకి అందిస్తే, జగన్ ఏకంగా రూ. 1,75,571 కోట్ల సాయాన్ని రైతులకి అందించి వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారు.

రైతుకి ఉపయోగపడే పనులు ఏ ఒక్కటీ చెయ్యకుండా, జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేసిన పనులను వృథా వ్యయంగా చిత్రీకరిస్తూ - రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా కాలికి బలపంకట్టుకుని ఊరూరా ప్రచారం చేశారు. కానీ, ఫలితాలు చూసి, ఆ విషయం మళ్ళీ మాట్లాడటం మానేశారు.

చంద్రబాబు తన ప్రభుత్వం ద్వారా 34,780 ఉద్యోగాలు ఇస్తే , జగన్ 2,36,502 ఉద్యోగాలిచ్చి నిరుద్యోగ నివారణకు ఎంతో కృషి చేశారు, వైద్య, ఆరోగ్య శాఖ లో సాచురేషన్ పద్ధ‌తిలో ఎన్నో ఖాళీలు నింపి తగినంత మంది సిబ్బంది లేరనే కారణంగా ప్రజారోగ్యం దెబ్బతినకూడదని జగన్ చేసిన కృషి ఫలితమే కరోనా కాలంలో రాష్ట్రం ఇబ్బందులు లేకుండా పరిస్థితులని ఎదుర్కొంది.

బడుగు, బలహీన వర్గాలకి 200 స్థానాలకు గాను 100 ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి గౌరవించి సోషల్ ఇంజనీరింగ్‌కి జగన్ తెరతీశారు. అదే చంద్రబాబు కాలంలో కేవలం 69 సీట్లిచ్చి చేతులు దులుపుకున్నారు.

నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, జిల్లా పరిషత్‌ చైర్మన్ పదవులు భారీ సంఖ్యలో బడుగు వర్గాలకి ఇచ్చి పరిపాలనలో వారి వర్గాల అవసరాలు వారే గుర్తించి పరిష్కరించే అవకాశం కల్పించారు. ఉదాహరణకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 34 శాతం నుంచీ 24 శాతానికి సుప్రీం కోర్టు తగ్గిస్తే, జగన్ పార్టీ పరంగా 20 శాతం పెంచి, 44 శాతం బీసీలకు ఇచ్చిన ఘనత జగన్ కే చెల్లింది. నగరపాల‌క‌ సంస్థల్లో 92 శాతం మేయర్ పదవులు, మండల పరిషత్‌లలో 67 శాతం అధ్యక్ష పదవులు, ఇంకా వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఇలా అన్నింట్లోనూ ఆయన పదే పదే చెబుతున్నట్టు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరినీ గుర్తించి పదవులిచ్చి వారికి సమాజంలో రాజకీయంగా గౌరవనీయ స్థానాలు కల్పించారు.

చంద్రబాబు పాలనా కాలంలో రూ. 32,803 కోట్ల పెట్టుబడులొస్తే, 38 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. అదే జగన్ ముఖ్యమంత్రిగా గత నాలుగేళ్లలో 1,00,103 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి 3.47 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే ఏర్పాటు చేశారు.

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా రూ. 13.11 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు ప్రకటిస్తే, వాటిలో రూ. 2.46 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే కార్యరూపం దాల్చాయి.

దావోస్ సదస్సు ద్వారా రూ. 1.26 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు వస్తే, అందులో రూ. 85,541 కోట్లు కార్యరూపం లో ఉన్నాయి. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే నిబంధనను పెట్టి దానికి చట్టబద్ధత కల్పించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే..

రెండు పరిశ్రమలు తెచ్చి, అతిగా డబ్బా కొట్టుకుని, పచ్చ మీడియా ద్వారా బాకాలూదించిన వాడు చంద్రబాబు.

First Published:  24 April 2024 6:25 AM GMT
Next Story